ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ఫేర్స్
- September 10, 2016
లో కాస్ట్ క్యారియర్ ఎయిర్ ఇండియా శ్రీక్స్‌ప్రెస్, స్పెషల్ ఫేర్స్‌ని అబుదాబీ, సార్జా నుంచి ఎంపిక చేయబడిన రూట్లలో ప్రకటించింది. సెప్టెంబర్ 14 నుంచి అబుదాబీ - కోజి కోడ్ మధ్య చార్జీలు 365 దిర్హామ్‌లకు తగ్గుతుంది. ఎయిర్ ఇండియా ట్రావెల్ కన్సల్టెంట్ అబ్దుల్ సలైహ్ ఈ వివరాల్ని వెల్లడించారు. మామూలుగా అయితే కోజికోడ్‌కి ఒక వైపు చార్జీ 435 దిర్హామ్‌లు అంతకు మించి ఉంటుంది. ఒక్కోసారి ఈ మొత్తం 1,110 దిర్హామ్‌ల వరకు వెళుతుంది. సెప్టెంబర్ 14 వరకు తమ విమానాలన్నీ ఫుల్ అయిపోయినట్లుగా ఆయన వివరించారు. షార్జా ఆఫర్ల విషయానికి వస్తే, సెప్టెంబర్ 15 నుంచి నాన్ స్టాప్ విమానాలకు షార్జా నుంచి ఛండీగర్ వెళ్ళేందుకు 210 దిర్హామ్‌లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త రూట్‌లో ప్రమోషనల్ ఆఫర్‌గా దీన్ని ప్రకటించినట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 14 నుంచి కోచి కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ షార్జా నుంచి వారణాసి, తిరుచురాపల్లికి రోజువారీ నాన్‌స్టాప్ విమానాల్ని నడపనుంది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







