మిరియాలలో ఆరోగ్యకర ప్రయోజనాలు...
- September 10, 2016
మిరియాలను మనం వంటల్లో విరివిగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. మిరియాలలో మనకు ఉపయోగపడే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో మిరియాలతో తయారు చేసే టీని తాగడం వల్ల అధికంగా ఉన్న శరీర బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆకలిని తగ్గించడంలో మిరియాల టీ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్వీట్లు, అధిక క్యాలరీలు ఉన్న ఆహారం, టీ, కాఫీ, జ్యూస్‌లకు బదులుగా మిరియాల టీని తాగితే బరువు తగ్గుతారని వైద్యులు అంటున్నారు. మిరియాల టీతో మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.నిజానికి మిరియాల టీ తాగటం వలన శరీర బరువు తగ్గదు, ఈ మిరియాల టీతో పాటుగా, సరైన ఆహార పదార్థాలు, వ్యాయామాలు కూడా చేయాలి. మిరియాల టీ తాగడం వల్ల ఆకలి అనిపించకుండా చూస్తుంది. ఈ టీ తీసుకోవడం వలన కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, మల ప్రవాహాన్ని పెంచుతుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలతో చేసిన టీలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







