పాతవాహనాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలేసే యజమానులకు అబుధాబీ మునిసిపాలిటీ హెచ్చరిక
- August 05, 2015
పాడైపోయి, పనిచేయని స్థితిలోనున్న వాహనాలను దీర్ఘకాలంగా బహిరంగ స్థలాల్లో, రోడ్లపై వదిలివేయడం వల్ల నగర ఆకృతి, అందం దెబ్బతింటుందనే అవగాహన ప్రజలలో కల్పించడం కోసం అబుధాబీ మునిసిపాలిటీ వారు ఒక కంపైన్ను నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాహనాలను తొలగించడానికి యజమానులకు పాత కలవ్యవధి 14 రోజులు కాకుండా, సవ రించబడిన చట్టం (2), 2012 ప్రకారం 3 రోజులు మాత్రమే సమయమివ్వబడుతుందని, అప్పటికీ తొలగించకపోతే, 30,000 దీనర్ల జరిమానాతో పాటు వానిని వదిలివేయబడ్డ కార్ల షెడ్ కు తరలించడం తప్ప వేరే గత్యంతరం లేదని మునిసిపాలిటీ అధికారి ఒకరు హెచ్చరించారు. ఈ చట్టం ట్రైలర్లు, బోట్లకు కూడా వర్తిస్తుందని వివరిస్తూ, ఇటువంటి కఠిన చర్యల వలన భాద్యతారహితంగా వాహనాలను వదిలివేళ్లే వారి చర్యలు తగ్గుముఖం పట్టాయని అన్నారు.
--- సి. శ్రీ (అబుధాబి)
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







