విమానంలో 'అల్లాహ్‌ అక్బర్‌'.. 'మరణం సమీపిస్తోంది' అని అరుపులు

- September 11, 2016 , by Maagulf
విమానంలో 'అల్లాహ్‌ అక్బర్‌'.. 'మరణం సమీపిస్తోంది' అని అరుపులు

గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా చేతికి బేడీలు ఉన్న వ్యక్తి 'అల్లాహ్‌ అక్బర్‌'.. 'మరణం సమీపిస్తోంది' అని బిగ్గరగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంగ్లాండ్‌లోని గాట్విక్‌ నుంచి వెనిస్‌ బయలుదేరిన ఈజీజెట్‌ ఈజెడ్‌వై5263 విమానంలో ఈ ఘటన జరిగినట్లు బ్రిటీష్‌ హోం ఆఫీస్‌ అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చేతికి బేడీలు ఉన్న ఆ వ్యక్తి 29 సార్లు అల్లాహ్‌ అక్బర్‌, 17 సార్లు మరణం సమీపిస్తోంది, మనం అందరం చనిపోబోతున్నాం అని తొమ్మిది సార్లు అరిచినట్లు ప్రయాణికులు వెల్లడించారు.

అతడి కేకలతో భయపడిపోయిన ప్రయాణికులు, చిన్నారులు ఏడ్వడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన అధికారులు అతడ్ని అరవకుండా అదుపు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com