10000 ఉద్యోగాలను కల్పించనున్న స్నాప్ డీల్..!
- September 11, 2016
చేతిలో సరిపడా ఉద్యోగులు లేక, పండుగ సీజన్ ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని దేశీయ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్ లో తాత్కాలికంగా అదనపు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఉన్నట్టుండి దాదాపు 10,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించనున్నట్టు స్నాప్ డీల్ పేర్కొంది. ముఖ్యంగా డెలివరీలో ఎలాంటి సమస్యలు రాకుండా, వెనువెంటనే జరిపేటట్టు లాజిస్టిక్ పొజిషన్లలో వీరిని నియమించుకోనుంది. దీపావళి కానుకగా ఈ తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించనున్నట్టు స్నాప్ డీల్ పేర్కొంటోంది.
దీపావళి పండుగ సీజన్ అంతా, అన్ని లాజిస్టిక్ సెంటర్లు 24X7 పనిచేయనున్నట్టు తెలిపింది. ఆర్డర్లు రిసీవ్ చేసుకుని, స్క్రీన్ చేసి, వాటిని డెలివరీ చేసేందుకు ఈ తాత్కాలిక ఉద్యోగులు పనిచేయనున్నారు. ఎస్ డీ ప్లస్ సెంటర్లు ఆర్డర్లను ప్రాసెస్ ను నిరంతరాయం కొనసాగిస్తాయని, అర్థరాత్రి స్వీకరించిన ఆర్డర్లను, తర్వాతి రోజు ఉదయం పూట అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ దీపావళి సీజన్ లో కస్టమర్లు ఆర్డరు చేసిన వస్తువులను ఒకటి రెండు రోజుల్లోనే డెలివరీ చేసే విధంగా అప్ గ్రేట్ కావాలని నిర్ణయించుకున్నట్టు స్నాప్ డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







