గౌతంమేనన్. ఇప్పుడు విలన్‌గా ...
- September 11, 2016
ప్రేమ చిత్రాలకు కోలీవుడ్‌లో చిరునామాగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతంమేనన్. ఇప్పుడు విలన్‌గా వెండితెరకు పరిచయం కానున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇమైక్క నొడిగల్'. ఇందులో అధర్వ హీరో. నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో గౌతంమేనన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఈ కథ బాగా నచ్చడంతోనే విలన్‌గా నటించేందుకు గౌతం సమ్మతించారని తెలుస్తోంది. మరోవైపు అధర్వకు దీటుగా నయనతార ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు







