చీటింగ్‌: క్యాటిల్‌ మార్కెట్‌లో బీ అలర్ట్‌

- September 12, 2016 , by Maagulf
చీటింగ్‌: క్యాటిల్‌ మార్కెట్‌లో బీ అలర్ట్‌

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ (ఎంఇసి), వినియోగదారుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా జంతువుల్ని బలివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా పెద్దయెత్తున జంతువుల్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యాటిల్‌ మార్కెట్‌కి చేరుకుంటారు. రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు పూర్తి ఆరోగ్యంతో లేని జంతువల్ని అమ్మకందారులు వినియోగదారులకు విక్రయిస్తుంటారనే హెచ్చరికలు ఎంఇసి నుంచి వచ్చాయి. కొన్ని జంతువులను శుభ్రంగా కడిగి, వాటికి ఉన్న అనారోగ్యం గురించి తెలియకుండా చేస్తుంటారనీ, అలాగే అనారోగ్యంతో నీరసపడిపోయిన జంతువుల్ని క్రూరంగా హింసించి, అవి పడిపోకుండా చేస్తుంటారనీ, ఇంకొన్ని సందర్భాల్లో కేవలం తలను మాత్రం చూపించి, ఆ తర్వాత వేరేవాటిని అంటగడ్తుంటారనీ ఇలా రకరకాలైన మోసాలు జరుగుతుంటాయి కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎంఇసి ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంఇసి హెచ్చరికల్ని వినియోగదారులు స్వాగతిస్తున్నారు. ఎప్పుడూ తాను జంతువుల్ని కొనే దుకాణంలోనే ఈసారి కొంటున్నాననీ, తెలియని దుకాణాల్లో కొనడంలేదని, ఓ షీప్‌ని ఈసారి 1,200 ఖతారీ రియాల్స్‌ వెచ్చించి కొనుగోలు చేశానని చెప్పారు ఓ వ్యక్తి. ఇంకో వ్యక్తి, మార్కెట్‌ అంతా తిరిగి పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఓ షీప్‌ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com