ఈద్ అల్ అదా ప్రార్థనల్లో యూఏఈ పాలకులు
- September 12, 2016
యూఏఈ పాలకులు ఈద్ అల్ అదా ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఈద్ అల్ అదా ప్రార్థనల్ని జబెల్‌లోని షేక్ రషీద్ మాస్క్‌లో నిర్వహించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ డిప్యూటీ రూలర్ మరికొంతమంది ప్రముఖులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్క్ ఇమామ్ అల్ షేక్ ఒమర్ అల్ ఖతీబ్, ఈద్ సందర్భంగా ప్రవచనాలు చెప్పారు. ఈద్ అల్ అదా ప్రాముఖ్యతను వివరించారు. తమ త్యాగాల ద్వారా ముస్లింలు అల్లాకి దగ్గరయ్యేందుకు ఈద్ అల్ అదా అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పారాయన.
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, అల్ బదియా ముస్సాలాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, షేక్ రషిద్ బిన్ హుమైద్ అల్ నౌమి మాస్క్‌లో ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించారు. ఫుజారియా రూలర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి, షేక్ జాయెద్ మాస్క్‌లో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. ఉమ్ అల్ కైవాన్ రూలర్ షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముల్లా ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి రస్ అల్ ఖైమాలోని అల్ ఖుజామ్‌లోని గ్రాండ్ ఈద్ ముసాలాలో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం







