వాట్సాప్‌ ప్రైవసీ ప్లాన్‌పై భిన్నాభిప్రాయాలు

- September 12, 2016 , by Maagulf
వాట్సాప్‌ ప్రైవసీ ప్లాన్‌పై భిన్నాభిప్రాయాలు

దుబాయ్‌: స్మార్ట్‌ ఫోన్స్‌లో మెసేజింగ్‌ యాప్‌ అయిన వాట్సాప్‌ కొత్త ప్లాన్‌పై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్‌ బుక్‌ ద్వారా మెంబర్‌ డేటాను షేర్‌ చేసే వీలుండేలా కొత్త ప్లాన్‌ని వాట్సాప్‌ తెరపైకి తెస్తోంది. ఈ విషయంపై 2,800 మందిని సర్వే చేస్తే, అందులో నాలుగోవంతు వ్యక్తులు వాట్సాప్‌ని విడిచిపెడతామని తెలిపారు. ప్రైవసీ కండిషన్స్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌ పైరసీని తాను గౌరవిస్తాననీ, ఒకవేళ తనకు సంబంధించిన సమాచారం లీకై, అది తన కెరీర్‌ మీద ప్రభావం చూపిస్తే దాన్ని తానెలా సమర్థిస్తానని అవినాష్‌ సెక్వేరా అనే ఇండియన్‌ ఎక్స్‌పాట్‌ చెప్పారు. ఒక్కసారి ఆన్‌లైన్‌లోకి ఎంటర్‌ అయితే ఏదీ సీక్రెట్‌గా ఉండదనీ, ప్రైవసీ విషయంలో 'సెక్యూరిటీని' ఆశించడమే తగదని పాకిస్తాన్‌కి చెందిన వలసదారుడొకరు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌కి పోస్టింగ్స్‌కి సంబంధించి కఠినంగా చట్టాలు అమలయ్యే యూఏఈలో, ప్రైవసీని తగ్గించడమంటే అది సరికొత్త సమస్యలకు తావిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com