ఆస్పైర్ పార్క్ లో పలు కుటుంబాలు ఈద్ సంబరాలు

- September 13, 2016 , by Maagulf
ఆస్పైర్ పార్క్ లో  పలు కుటుంబాలు ఈద్ సంబరాలు

ఈద్ అల్ అధా మొదటి రోజున  పలు కుటుంబాలు పిక్నిక్లు మరియు సమావేశాలు  జరుపుకునేందుకు  ఆస్పైర్ పార్క్ కు  ఎగబడ్డారు, దీనితో ఈ  ప్రాంతం చుట్టూ ఒక సరళమైన సంతోష వాతావరణం నెలకొంది. ఇక్కడ సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల ఎంతో  సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చల్లటి ఉష్ణోగ్రతలు కూడా ఈ పార్కుకి  కుటుంబాలతో  వారాంతాలలో బహిరంగ ప్రదేశాలలో గడిపేందుకు  వాతావరణ పరిస్థితులు  ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నాయి.  ఒక నివాసీయుని విశ్లేషణ  ప్రకారం, ఈ పార్క్ అనేక మంది సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా తయారుచేయడం కూడా ఇక్కడకు రావడానికి ప్రధాన కారణమవుతుందని  పేర్కొంటూ ,  నా కుటుంబంతో ఇటీవల కాలంలో వెలుపలకు రావడం చాలా కాలం అయ్యంది. ఎందుకంటే, ఇటీవల కాలం వరకు భయానక  వేసవి వేడి కారణంగా ఆరుబయటకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ ఇపుడు వాతావరణం అనుకూలంగా మారి ఎవరికైనా ప్రకృతి శోభని  ఆస్వాదించాలని అన్పిస్తుంది. ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. నేను  నా పిల్లల తరగతి సెలవులో ఉండగానే మళ్లీ ఇంకోమారు ఈ  పార్క్ కు  వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొంటున్నట్లు ఆయన  " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఆసియా ప్రవాసీయుల  బృందం తమ అనుభవాలు పంచుకొంటూ , తామంతా  ఈ  పార్క్ కు  పిక్నిక్ కు వచ్చిన మాదిరిగా వస్తామని, బహిరంగంగా చిన్న చిన్న  పార్టీలు జరుపుకోవడానికి ఈ పార్క్ ఎంతో  ఆదర్శవంతమైన స్థానమని  చెప్పారు. "మేము ముఖ్యంగా మా సెలవు  రోజులలో, ఈ  పార్క్ కు రావడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నామని తెలిపారు. అనేక మంది పర్యాటకులు కాలితో తొక్కడం ద్వారా నడిచే పడవలు పలువుర్ని అలరిస్తున్నాయి. , పార్క్ వద్ద ఉన్న  ప్రముఖ సౌకర్యాలు పట్ల సందర్శకులు ఎంతో  ఆనందిస్తున్నారు. ఈ  పడవలని సాయంత్రం 4 గంటల నుండి  9 గంటల వరకు  అందుబాటులో ఉన్నాయి. ఒక జెట్ స్కీ సిబ్బంది సైతం  మానవ నిర్మిత సరస్సు చుట్టూ వలయం మాదిరిగా ఉండి  తెడ్డు పడవలని  ప్రజలు సురక్షితం గా నడపవచ్చని  నిర్ధారిస్తున్నారు. 88-హెక్టార్లలో ఆస్పైర్ పార్క్ విస్తరించి ఉంది  జాగింగ్, మరియు ఇతర భౌతిక చర్యలకు ఇది  తగిన స్థానం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు వేగంగా కదిలే వాహనాలు గురించి చింతిస్తూ బాధ  లేకుండావారు ఆదుకునేలా ఉండే ప్రదేశం. మేము నీటి ఫౌంటెన్పార్క్ స్వీయ చిత్రాల ( సెల్ఫీ ఫోటోలు )  తీసుకోవాలని ఒక మంచి ప్రదేశం. ఈ ఈద్ అల్ అధా కు  కతర్ పర్యాటక అథారిటీ దాని ఈవెంట్స్ క్యాలెండర్ లో ఆస్పైర్ జోన్ చేసింది. ఆస్పైర్ జోన్ వెబ్సైట్ ప్రకారం, సందర్శకులు సాయంత్రం  4 గంటల  నుండి 9 గంటల  ఈద్ అంతటా జరుగనున్న కార్యకలాపాలని వీక్షించి  ఆనందించమని కోరుతున్నారు,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com