రియో గోల్డ్: ఖలాఫ్ని ప్రశంసించిన షేక్ మొహమ్మద్
- September 13, 2016
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రియో పారా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించినందుకుగాను 47 ఏళ్ళ ఖామిస్ ఖలాఫ్ని ప్రశంసలతో ముంచెత్తారు. పురుషుల 88 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఖలాఫ్ గోల్డ్ మెడల్ సాధించారు. రియో పారా ఒలింపిక్స్‌కి వెళుతూ ఈ సారి ఖచ్చితంగా పతకం తీసుకొస్తాననే హామీ ఇచ్చిన ఖలాఫ్ మాట నిలబెట్టుకోవడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2012లో తన ప్రదర్శన నిరాశపరిచిందని, ఈసారి సాధించిన పతకంతో తాను పూర్తి ఆనందంతో ఉన్నట్లు పతకం గెలిచిన తర్వాత ఖలాఫ్ అన్నారు. యూఏఈ ఇప్పటికే రెండు సిల్వర్ మెడల్స్‌ని సొంతం చేసుకుంది. ఖలాఫ్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల దేశమంతా గర్విస్తోందని షేక్ మొహమ్మద్ ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







