హజ్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక్తరహిత ఈద్
- September 13, 2016
మినా : కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం మరియు సంక్షిప్త సమాచార సందేశాలకు ధన్యవాదాలు, యాత్రికులకు చేతులకు రక్తం అంటకుండా పశువులని చూసి అవసరం లేకుండా వారు ఈద్ అల్ అధా త్యాగం జరిపించారు. ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్లకు పైగా ఎక్కువ మంది యాత్రికులకు త్యాగం కంప్యూటరీకరణ కూపన్లు ద్వారా ఈ అవకాశం లభించింది.ప్రపంచంలో 1.5 బిలియన్ ముస్లింల కంటే ఎక్కువ మంది అనేకులు తమంతట తాము ఒక కత్తి ఎంచుకొని ఈద్ అల్ అధా గుర్తుగా గొర్రెలు లేదా ఇతర జంతువులని స్వయంగా చంపడానికి యత్నిస్తారు.. ఒక్కో యాత్రికుడు తానే స్వయంగా ఒక గొర్రెని బలి ఇవ్వాలంటే , తగినంత స్థలం ఇక్కడ ఉండేది కాదని జాంరత్ బ్రిడ్జ్లో ఒక సౌదీ పోస్టాఫీస్ వద్ద రబీఎ సాలెహ్ అనే సుడానీయుడు తెలిపాడు. గతంలో యాత్రికులు, తాము పేదలకు మాంసం పంచడానికి ముందు వారే స్వయంగా జంతువులని బలి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు యాత్రికులు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ప్రతివారు ఒక గొర్రెని బలి ఇవ్వాలి అంటే అది రోజుల తరబడి తంతుగా మారుతుందని 33 ఏళ్ల సౌదీ భక్తుడు మిషాల్ అల్ ఖహ్తానీ చెప్పారు. కాబట్టి జెడ ఆధారిత ఇస్లామిక్ అభివృద్ధి బ్యాంక్ ( ఐ డి బి ) ఎలక్ట్రానిక్ కూపన్ వ్యవస్థని 460 ఎస్ ఆర్ తో ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. పవిత్ర స్థలం చుట్టూ వ్యాపంచి ఉన్న సంస్థలు యాత్రికులు సందర్శించగానే కూపన్ తీసుకొని బలి గావించి ఆ కార్యక్రమం పూర్తిచేస్తారు. ఎవరో ఒక యాత్రికుడు మా నుండి ఒక గొర్రె కొనుగోలు చేయాలన్నట్లు బ్యాంకు పంపిన ఒక అభ్యర్థన మా సిస్టమ్ ద్వారా చేరుతుంది వెంటనే ఒక గొర్రెని ఒక అడుగు తొట్టి లో నుండి వధశాలకు పంపబడుతుందని మన్సోర్ అల్ మల్కి 45 ఏళ్ళ సౌదీ పోస్ట్ ఉద్యోగి తెలిపారు . ఆ గొర్రె మాంసంని ముక్కలుగా నరికి మక్కా లో మరియు చుట్టూపక్కలా పంచడం ఒక అదృష్టంగా భావిస్తారు. కొంత మాంసం విదేశాలకు సైతం పంప బడుతుందని అల్ మల్కి చెప్పారు. గతంలో కాగితం కూపన్లు ఉండేవి కానీ ఇప్పుడు అది కంప్యూటరీకరణ చేసిన బిల్ ఉందని ఆయన తెలిపారు. అల్ ఖహ్తానీ తాను త్యాగం కోసం చెల్లించిన ఒక రసీదుని పొందారు. అదేవిధంగా వారు ఒక గొర్రెని వధించినట్లు వారు ఒక ఎస్ ఎం ఎస్ నాకు త్వరలోనే పంపుతామని అల్ ఖహ్తానీ చెప్పారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







