`శరభ` యూనిట్ ఇటలీకి..
- September 14, 2016
ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `శరభ`. జయప్రద, నెపోలియన్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమన్ ఏమోషన్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డ్యూయెట్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఇటలీ వెళుతుంది. ఈ సందర్భంగా.....
చిత్ర నిర్మాత ఆకాష్ సహదేవ్, సురేష్ కపాడియా మాట్లాడుతూ - ``విజువల్ వండర్ గా రూపొందుతోన్న శరభ మూవీ టాకీ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపబోతున్నాం. భారీ బడ్జెట్ తో , క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ ను ఇటలీలోని రోమ్, నా ప్లెస్ తదితర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం. అందులో భాగంగా సెప్టెంబర్ 25న యూనిట్ ఇటలీ వెళుతుంది. రఘు మాస్టర్ నేతృత్వంలో ఫారెన్ డ్యాన్సర్ తో ఈ పాటను చిత్రీకరిస్తాం. అలాగే స్విజర్లాండ్ లోని ఆల్ఫ్ మౌంటెన్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం`` అన్నారు.
ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, జయప్రద, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి,రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్,ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







