అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారీ సైనిక సహకార ఒప్పందానికి వచ్చాయి.
- September 14, 2016
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారీ సైనిక సహకార ఒప్పందానికి వచ్చాయి. దీని విలువ సుమారు 38 బిలియన్ డాలర్లని అంచనా. దీనికి సంబంధించిన ఒప్పందంపై బుధవారం సంతకాలు జరగనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే పదేళ్లలో అమెరికా ఇజ్రాయెల్‌కు సైనిక సహకారం అందజేస్తుంది. ఈ డీల్ కోసం దాదాపు 10నెలలుగా చర్చలు జరుగుతున్నాయి.
అమెరికా ఏదైనా ఒక దేశానికి చేస్తున్న అతిపెద్ద సైనిక సాయం ఇదే. మరో పక్క ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ కూడా భారీ రాయితీలను ప్రకటించారు. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ జాకబ్ నగెల్ వాషింగ్టన్‌తో బేరసారాలు జరుపుతున్నారు.
మరోపక్క వైట్‌హౌస్ కూడా ఈ డీల్‌కు సంబంధించి కాంగ్రెస్ సభ్యులకు సమాచారం అందజేస్తోంది.
అమెరికా ఆధ్వర్యంలో ఇటీవల ఇరాన్‌తో అణుఒప్పందం జరగడం ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. దీనిని నెతన్యాహూ తీవ్రంగా వ్యతిరేకించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







