నరేంద్రమోదీ జన్మ దినాన గిన్నీస్ రికార్డుల కోసం ప్రయత్నాలు

- September 15, 2016 , by Maagulf
నరేంద్రమోదీ జన్మ దినాన గిన్నీస్ రికార్డుల కోసం ప్రయత్నాలు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 66 వ పుట్టిన రోజు వేళ సంక్షేమ కార్యక్రమాలతో నాలుగు గిన్నీస్ రికార్డును నెలకొల్పేందుకు బీజేపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 17 న మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నవ్సారీలో 11,000 మంది దివ్యాంగులను ఒక చోట చేర్చి వారికి అవసరమైన వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.7.5 కోట్లను ఖర్చు చేయనున్నారు. 

1000 మంది వికలాంగులకు వీల్ చైర్లు, మరో వెయ్యి మంది వినికిడిలోపం గల వారికి హియరింగ్ మిషిన్లను ఒకే సారి పంపిణీ చేస్తారు. అనంతరం 1000 మంది దివ్యాంగులతో కలిసి దీపాలతో ర్యాలీగా ప్రదర్శనను నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com