వేరుసెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు....
- September 15, 2016
వేరుసెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో నాలుగు సార్లు వీటిని తింటే గుండెజబ్బులు చాలా మటుకూ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే వారానికి రెండు సార్లైనా పల్లీలు తినేవారు బరువు పెరిగే అవకాశం తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.వేరుసెనగల్లోని రాగి చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. తద్వారా గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. వీటిల్లో మోనోశాచురేటెడ్ కొవ్వులూ, యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి.రోజూ కనీసం 15 గ్రాముల వేరుసెనగలు లేదా నట్స్ తీసుకునే వారిలో ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. వేరుసెనగలు, ఇతర గింజలు(బాదం, జీడి, ఆక్రోట్లు మొదలైనవి), వేరుసెనగ పేస్టును తీసుకునే మధ్య వయస్కులపై జరిపిన పరిశోధనలో వేరుసెనగలు, ఇతర గింజలు తిన్నవారిలో శ్వాస సంబంధిత, గుండె జబ్బులు, నాడీ క్షీణత, డయాబెటిస్, క్యాన్సర్ తదితర వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తక్కువగా ఉందని తేల్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







