మోహన్ బాబు వేడుకకి హాజరుకానున్న చిరు ..
- September 15, 2016
మెగా స్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ల మధ్య వైరం గురించి అందరికీ తెలుసున్న సంగతే.. కాగా మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉంది అని మోహన్ బాబు ఒక సారి వెల్లడించారు. కాగా ఇద్దరికీ మధ్య ఎంత వైరం ఉందో తెలియదు కానీ ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్ కు మరొక ఫ్యామిలీ హాజరు అవుతూనే ఉంటారు. తాజాగా చిరు 61 వ పుట్టిన రోజు వేడుకల్లో మంచు లక్ష్మి చిరుతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. కాగా మోహన్ బాబు సినీ పరిశ్రమలో అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకొని టి. సుబ్బిరామి రెడ్డి ఆద్వర్యంలో వైజాగ్ లోని మున్సిపల్ స్టేడియం లో మోహన్ బాబుని "నవరస నట తిలకం" పురష్కారంతో సత్కరించనున్నారు. ఈ వేడుకకు తెలుగు తారాతోరణం తరలి వెళ్లనున్నది. వెంకటేష్, నాగార్జున, దాసరి, జయసుధ, జయప్రద, సుమలత వంటి వారు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కాగా చిరు తన 150 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా మోహాన్ బాబు తో ఉన్న స్నేహం రీత్యా వేడుకకు హాజరు కానున్నారట. ఈ వేడుక ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరగబోతున్నది. -
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









