దుబాయ్ పబ్లిక్ బస్సుల్లో 70 మిలియన్ రైడర్స్
- September 15, 2016
దుబాయ్: ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లెక్కల ప్రకారం 70,732,502 మంది ప్రయాణీకులు 2016 తొలి సగంలో పబ్లిక్ బస్సుల్లో ప్రయాణించినట్లు తేలింది. గత ఏడాది ఇదే సమయానికి 66,703, 583 మంది పబ్లిక్ బస్సుల్ని వినియోగించారు. ఆ లెక్కన ఈ ఏడాది ప్రయాణీకుల శాతం 4.6 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ ఆఫ్ బసెస్ బస్సెల్ సాద్ ఇబ్రహీమ్ మాట్లాడుతూ, వివిధ వర్గాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగించడానికి మొగ్గు చూపుతునన్నారనే విషయం గణాంకాల ద్వారా వెల్లడవుతోందని అన్నారు. బస్సుల్ని మెట్రో, ట్రామ్, మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్‌తో లింక్ అప్ చేయడంతో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణానుభూతిని ఇవ్వగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. బస్సు ప్రయాణీకుల కోసం అత్యాధునిక సౌకర్యాల్ని దుబాయ్ ఎమిరేట్‌లో కల్పిస్తున్నామని చెప్పారాయన. ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆసక్తిని పెంచడం ద్వారా ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించడం అలాగే, భద్రతా పరంగా వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వడం వంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్య ఉద్దేశాలని ఆయన వివరించారు. ఈ ఏడాది పబ్లిక్ బస్సుల్ని వినియోగించేవారి సంఖ్యలో 15 శాతం పెరుగుదలను ఆశిస్తున్నట్లు చెప్పారాయన. మొత్తం 1,541 బస్సుల్లో, 347 ఆర్టిక్యులేటెన బస్సులు, 170 డబుల్ డెక్కర్ బస్సులు, 24 ఇంటర్సిటీ బస్సులు, మిగతావి వివిధ రకాల కేటగిరీలకు చెందిన బస్సుల్ని పబ్లిక్ బస్ ఫ్లీట్ కలిగి ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









