ఎయిర్ అంబులెన్స్‌లో ఇండియాకి
- September 15, 2016
అబుదాబీ: బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఇండియాకి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఎలియాస్ జార్జ్‌ని అబుదాబీ నుంచి అతని స్వస్థలం ఇండియాలోని కోచికి తరలించేందుకోసం ఎయిర్ అంబులెన్స్‌ని వినియోగించనున్నారు. జులై 16న జార్జ్‌కి బ్రెయిన్ స్ట్రోక్ రాగా, అబుదాబీలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో చేర్చారు. అక్కడే అతనికి రెండు నెలలుగా వైద్య చికిత్స అందుతోంది. స్థానికంగా ఉన్న ఓ కంపెనీ, అతని వైద్య ఖర్చుల్ని భరిస్తోంది. అయితే ఆ సంస్థ పేరు వెల్లడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఆ సంస్థ తమను ఆదుకునేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయమని జార్జ్ సోదరుడు ఆస్టిన్ బ్రూజ్ చెప్పారు. అబుదబీ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 11 గంటల సమయంలో విమానం బయల్దేరనుంది జార్జ్‌తోపాటుగా. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సాయంత్రం 4.30 నిమాషాల సమయంలో చేరుకుంటుంది. ఈ ఎయిర్ అంబులెన్స్‌లో డాక్టర్, పారా మెడిక్ ఉంటారు. ఎయిర్ అంబులెన్స్ కోసం 130,000 దిర్హామ్‌లు ఖర్చు చేస్తున్నారు. జార్జ్ పనిచేస్తున్న సంస్థ ముందుగా ఎయిర్ అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే 200,000 దిర్హామ్‌లకు కొటేషన్ ఇచ్చారు. అయితే ఆసుపత్రి వర్గాలు చొరవ తీసుకోవడంతో కాస్త తక్కువ ధరకే ఎయిర్ అంబులెన్స్ దక్కింది. ఇంకో వైపున పోలీసులు 30 కిలోమీటర్ల రోడ్ ట్రాఫిక్‌ని జార్జ్ కోసం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







