భారత్, అమెరికా పరస్పరం సహకరించుకుంటే ఎన్నో అద్భుతాలే....
- September 15, 2016
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా పరస్పరం సహకరించుకుంటే ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని వైట్‌హౌస్ పేర్కొంది. ఇది ఆ రెండు దేశాలకే కాక మొత్తం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపింది. లావోస్‌లో 14వ భారత్-ఆసియాన్ సదస్సు, 11వ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమైన వారం తర్వాత వైట్‌హౌస్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జోష్ ఎర్నెస్ట్ విలేకరులతో మాట్లాడుతూ.. అనేక కీలకాంశాలపై కలసి పనిచేసే అవకాశం ఇరు దేశాలకు ఉందని చెప్పారు. పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధించే విషయంలో అంతర్జాతీయంగా అనేక సందేహాలు వచ్చాయని, అయితే భారత్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడంతో దానిపై ఏకాభిప్రాయం వచ్చిందని తెలిపారు.ఇది ప్రధాని మోదీ సాధించిన ఘనత అని, వాతావరణ ఒప్పందంపై ఒబామాతో పాటు ప్రపంచ దేశాల అధినేతలతో నిరంతరం మోదీ సంప్రదింపులు జరపడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భారత, అమెరికా సంబంధాలు మోదీ, ఒబామా నాయకత్వంలో మరింత బలోపేతం కావడాన్ని అమెరికా అధ్యక్షుడు గర్వంగా భావిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









