కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య..
- September 15, 2016
అక్కినేని నాగచైతన్య తరువాతి సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈమెతోపాటు మరో హీరోయిన్‌తో కూడా చైతు రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు వరుస హిట్లతో యంగ్ హీరోలకి లక్కీ హిరోయిన్‌గా మారిన లావణ్య త్రిపాఠి. లావణ్య ఇప్పటికే '్భలే భలే మగాడివోయ్, 'సోగ్గాడే చిన్నినాయన', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి విజయాలతో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న ఈ చిత్రంలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఉండబోతోందని వినికిడి.అలాగే ఈ చిత్రానికి 'ఒకసారి ఇటు చూడవే' అనే క్రేజీ టైటిల్‌ను కూడా లాక్ చేశారట. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక సమాచారం అందలేదు. ఇకపోతే నాగచైతన్య నటించిన 'ప్రేమమ్' అక్టోబర్ 7న విడుదల కానుండగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన మరో చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







