డైరెక్టర్ ప్రియదర్శన్, లిజీ విడాకులు తీసుకున్నారు...
- September 16, 2016
ఇటీవల సినీ రంగంలో విడాకుల వార్తలు తరుచుగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, సీనియర్ హీరోయిన్ లిజీ లక్ష్మీలు విడాకులు తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు చాలా సార్లు వార్తలు వినిపించాయి. శుక్రవారం ఈ విషయాన్ని లిజీ అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఒక మీడియా ప్రకటనలో భాగంగా లిజీ లక్ష్మీ, దర్శకుడు ప్రియదర్శన్ తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నానని, ఇద్దరం ఫ్యామిలీ కోర్టులో విడాకుల పత్రాలమీద సంతకం చేశామని తెలిపింది.మళయాల ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ప్రియదర్శన్, అప్పటి స్టార్ హీరోయిన్ లిజీ లక్ష్మీని 1990లో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా..ఎప్పుడు బహిరంగంగా వివాదం పై మాట్లాడలేదు. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరు విడిగానే ఉంటున్నారు. విడాకుల తరువాత శనివారం జరగనున్న సిసిఎల్ మ్యాచ్ కోసం ఈ జంట ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







