9,459 కేసుల్ని హ్యాండిల్‌ చేసిన ఎస్‌ఆర్‌సిఎ

- September 16, 2016 , by Maagulf
9,459 కేసుల్ని హ్యాండిల్‌ చేసిన ఎస్‌ఆర్‌సిఎ

రియాద్‌: సౌదీ రెడ్‌ క్రిసెంట్‌ అథారిటీ (ఎస్‌ఆర్‌సిఎ) మక్కా మరియు పవిత్ర స్థలాల్లో మొత్తం 9,459 కేసుల్ని డీల్‌ చేసింది గడచిన 12 రోజుల్లో. ఎస్‌ఆర్‌సిఎ గ్రౌండ్‌ టీమ్స్‌ మొత్తంగా 2,267 కమ్యూనికేషన్‌ రిక్వెస్ట్‌లను అందుకున్నాయి. వాటిల్లో 508 కేసుల్లో సీరియస్‌నెస్‌ లేకపోవడంతో వాటిని లైట్‌ తీసుకున్నాయి. ఎస్‌ఆర్‌సిఎ గ్రౌండ్‌ మరియు అంబులెన్స్‌ టీమ్‌లు 842 కేసుల్ని పలు ఆసుపత్రులకి, ఇతర వైద్య కేంద్రాలకి తరలించాయి. అలాగే 917 కేసుల్లో వైద్య సహాయం అందించాయి. ఎస్‌ఆర్‌సిఎ టీములు 1,552 యాత్రీకుల వద్దకు, అలాగే 205 నాన్‌ ఫిలిగ్రిమ్స్‌ వద్దకు వెళ్ళాయి. మహిళా వాలంటీర్లు కూడా యాక్టివ్‌గా పనిచేశారు. పారామెడిసిస్ట్స్‌, జనరల్‌ ప్రాక్టీషనర్స్‌, కన్సల్టెంట్స్‌ రూపంలో సేవలందించారు మహిళా వాలంటీర్లు. మూడు రోజులపాటు రాత్రి 10 గంటల వరకూ వీరు సేవలందించినట్లు ఎస్‌ఆర్‌సిఎ అధికార ప్రతినిథి చెప్పారు. 12 రోజుల్లో ఎస్‌ఆర్‌సిఎ టీమ్‌లు చేసిన కృషి పట్ల యాత్రీకులు హర్షం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com