22,000 ఉద్యోగాల్ని విడిచిపెట్టారు
- September 16, 2016
రియాద్: 2015లో మొత్తం 22,323 మంది ఉద్యోగులు తమ ప్రభుత్వ ఉద్యోగాల్ని విడిచిపెట్టారు. వీరిలో ఎడ్యుకేషన్ సెక్టార్‌కి చెందినవారే (53 శాతం) అధికం. ఉద్యోగాల్ని విడిచిపెట్టినవారిలో పురుషుల సంఖ్య 13,711 (61 శాతం) కాగా, మహిళల సంఖ్య 8,612 (39 శాతం)గా ఉంది. పబ్లిక్ సెక్టార్లో 8,814 మంది ఉద్యోగాల్ని వదులుకున్నారు. హెల్త్ సెక్టార్లో 1,055 మంది ఉద్యోగాల్ని వదిలేశారు. పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ సంఖ్య 11,770 మంది. మినిస్ట్రీ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ ప్రకారం సివిల్ సర్వీసెస్ లా - ఆర్టికల్స్ 10, 11, 12, 13కి లోబడి హక్కులు, బెనిఫిట్స్ నిర్వచించబడ్తాయి. కింగ్డమ్ తరఫున కింగ్ డమ్ బయట పనిచేయాల్సి వస్తే, ఆ వ్యక్తి కింగ్డమ్లో పనిచేస్తున్న వ్యక్తిలానే గుర్తించబడతారు. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ సమాచారం అంతా సరైనదో లేదో చూసుకుని, జదారా ద్వారా వివరాలు పొందవచ్చు. సరైన సమాచారం లేని, భిన్నమైన సమాచారం ఉన్న అభ్యర్థులు జదారా ద్వారా అబ్జెక్షన్ని సబ్మిట్ చేయవచ్చునని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సర్వీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







