త్వరలో రానున్న ఆధార్ యాప్
- September 16, 2016
మరో 6 నెలల్లో ఆధార్ యాప్ రానుంది. పూర్తిస్థాయిలో సురక్షితం, గోప్యతలతో దీన్ని సంబంధిత ప్రాధికార సంస్థ యూఐడీఏఐ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికి ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు. తరువాత యాపిల్, మైక్రోసాఫ్ట్ ఓఎస్‌లకు అనుగుణంగా కూడా లభిస్తుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అవసరాలకు అనుగుణంగా చూసుకోవచ్చు. ఇది ఒకసారి పంపించే పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా పనిచేస్తుంది. యాప్‌ను వినియోగించిన ప్రతిసారీ.. దానికి అనుసంధానమైన ఈమెయిల్‌కు వెంటనే సమాచారం అందుతుంది. ఆధార్‌కు అనుగుణంగా చరవాణిలు రూపొందించాలని ఇప్పటికే యూఐడీఏఐ ఆయా తయారీదారులకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
మన దేశంలో 104 కోట్ల మందికి ఆధార్ గుర్తింపు ఉంది. 40 కోట్లకు పైగా స్మార్ట్ చరవాణిలు వినియోగంలో ఉన్నాయి.
యాప్ విశేషాలు..
* వినియోగదారులకు సౌలభ్యంగా ఆధార్ యాప్ ఉండబోతోంది. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్ల వద్దకు వెళ్లేటప్పుడు ప్రతిసారీ ఆధార్ కార్డులను తీసుకెళ్లే అవసరం తగ్గిపోతుంది.
* పాస్వర్డ్ రక్షణలో ఉండటం వల్ల ఒకవేళ చరవాణిని పోగొట్టుకున్నా ఆధార్ యాప్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండదు.
* ఈ యాప్‌ను ఎన్నిసార్లు, దేనికి వినియోగించిందీ మొత్తం చరిత్ర (ట్రాన్సేక్షన్ హిస్టరీ) ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. దీంతో వేరేవాళ్లు వినియోగిస్తే వెంటనే తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









