హైపర్ చిత్ర ఆడియో విడుదల
- September 16, 2016
తండ్రి అంటే ఆ యువకుడికి అమితమైన ప్రేమ. ప్రతి క్షణం ఆయన బాగోగుల గురించి తపిస్తుంటాడు. తండ్రీకొడుకుల కన్నా మంచి మిత్రుల మాదిరిగా కలిసిమెలిసి వుండే వారి అనుబంధం ఎలాంటిదో తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు సంతోష్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హైపర్. రాశిఖన్నా కథానాయిక. వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.జిబ్రాన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర ఆడియోలోని మొదటి పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాట కూడా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించే చురుకైన యువకుడిగా ఆయన కనిపిస్తారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌శ్రీను, తులసి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







