హైపర్ చిత్ర ఆడియో విడుదల

- September 16, 2016 , by Maagulf
హైపర్ చిత్ర ఆడియో విడుదల

తండ్రి అంటే ఆ యువకుడికి అమితమైన ప్రేమ. ప్రతి క్షణం ఆయన బాగోగుల గురించి తపిస్తుంటాడు. తండ్రీకొడుకుల కన్నా మంచి మిత్రుల మాదిరిగా కలిసిమెలిసి వుండే వారి అనుబంధం ఎలాంటిదో తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు సంతోష్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హైపర్. రాశిఖన్నా కథానాయిక. వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.జిబ్రాన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర ఆడియోలోని మొదటి పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాట కూడా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించే చురుకైన యువకుడిగా ఆయన కనిపిస్తారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌శ్రీను, తులసి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com