మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజరుద్దీన్‌ను బీసీసీఐ ఆహ్వానించింది..

- September 16, 2016 , by Maagulf
మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజరుద్దీన్‌ను బీసీసీఐ ఆహ్వానించింది..

టీమిండియా 500వ టెస్టుకు భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజరుద్దీన్‌ను బీసీసీఐ ఆహ్వానించింది. ఈ చారిత్రక టెస్టు వేడుకల్లో భాగంగా మాజీ కెప్టెన్లను సన్మానించాలని భావిస్తున్న బోర్డు తొలుత అజర్‌ను ఆహ్వానించకూడదని భావించింది.
అయితే, తన నిర్ణయాన్ని మార్చుకొని అజర్‌కు ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానానికి అజర్ అంగీకారం తెలలిపాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బోర్డు అజర్‌పై జీవితకాల నిషేధం విధించింది. అయితే, కోర్టు నిర్దోషిగా ప్రకటించినా అధికారిక కార్యక్రమాలకు బోర్డు ఆయనను ఆహ్వానించడం లేదు.కానీ, మిగతా అందరు మాజీలను మాదిరిగానే ఇప్పుడు అజర్‌నూ ఆహ్వానించినట్టు బోర్డు సీనియర్‌ అధికారి రాజీవ్‌శుక్లా తెలిపారు. అజర్‌తో పాటు మాజీ సారథులు సచిన్‌, వెంగ్‌సర్కార్‌, శ్రీకాంత బోర్డు ఆహ్వానానికి సమ్మతించి గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో జరిగే సన్మాన సభకు హాజరవుతామని చెప్పారని శుక్లా తెలిపారు.అనారోగ్య కారణాలతో ఈ వేడుకకు రాలేనని అజిత వాడేకర్‌ చెప్పారని అన్నారు. భారత-న్యూజిలాండ్‌ మధ్య ఈనెల 22న మొదలయ్యే తొలి టెస్టు టీమిండియాకు 500వ మ్యాచ్‌ కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెండి నాణేన్ని టాస్‌గా ఉపయోగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com