మల్లె మంచి ఔషధకారిణి
- August 07, 2015
మల్లె పువ్వు అంటే మనకి గుర్తొచ్చేది అమ్మాయిల కొప్పులో అందంగా మాలలా ఒదిగిపోయేవే. అంతేకాదు. మల్లెలు ఆలుమగల మధ్య ఆకర్షణకు ఆనందానికి మంచి సూచికలు. పెరట్లో మల్లె చెట్టు ఉంటే దాని నుంచి వచ్చే సువాసనభరితమైన గాలి మనసుకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది కూడా. ఇవన్నీ మనకి బయటికి కనిపించే మల్లె గమ్మత్తులు. ఇంతే కాకుండా మల్లెకున్న సువాసన కారణంగా వీటిని సౌందర్యలేపనాల్లోనూ, నూనెల తయారీలోనూ, కొవ్వొత్తుల తయారీలోనూ కూడా ఉపయోగిస్తారు. మల్లె పూలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి నిల్వ చేయాలి. ఆ నూనెను తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య తీరడమే కాకుండా జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఒక తడి గుడ్డలో మల్లెపూలను మూటలా కట్టి, కళ్లపై పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గి, కళ్ల ఎరుపు కూడా తగ్గుతుంది. మల్లెల్లో విటమిన్ సి ఉంటుంది. అందుకే ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఆయుర్వేదంలో మల్లెలను అనేక మందుల తయారీలో వాడతారు. గ్రీన్‌టీలో తేయాకుతో పాటు మల్లె రేకులను కూడా ఎండబెట్టి కలుపుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







