సైమా మొదటి రోజు సందడి
- August 07, 2015
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015 (సైమా) వేడుక గురువారం రాత్రి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని రషీద్ హాల్ లో ఘనంగా ప్రారంభమయింది. ఈ వేడుకలో దక్షిణ భారత సినీతారలు, ప్రముఖులు సందడి చేశారు. పలువురు తారలు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. తెలుగు నటులు రాణా, శ్రియ, మంచు లక్ష్మి, ఆలి తదితరులు వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. నటి ప్రణీత, ఆదాశర్మలు తమ నృత్య ప్రదర్సనలతో ఉర్రూతలూగించారు.రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో స్వర్గీయ డి.రామానాయుడు గారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డి.రామానాయుడు గారి జ్ఞాపికను విడుదలచేశారు. లెజెండ్ సినిమాకు గాను నందమూరి బాలకృష్ణ బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నారు మరియు బెస్ట్ యక్ట్రెస్స్ గా శ్రుతి హాస్సన్ అవార్డు ను అందుకున్నారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తప్ తమ స్వర మంత్రజాలంతో ప్రేక్షకులని మంతముగ్దులని చేశారు. ఆమె పాటలకి ప్రేక్షకులతో పాటు సినీతారలు కూడా స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ కె మీడియా వారు మీడియా పార్ట్నెర్ గా వ్యవహరించారు.
_1438971584.jpg)


--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







