కువైట్‌లో ఉర్రూతలూగించనున్న 'అమితాబ్ ఔర్ మై'
- September 18, 2016
భారతీయులను ఉర్రూతలూగించిన 'అమితాబ్ ఔర్ మై' ఇప్పుడు కువైట్వాసులతో చిందులేయించడానికి సిద్ధమవుతోంది. మైదాన్ హవేలీలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని ఇండియన్ యూత్ సొసైటీ నిర్వహిస్తోంది. 'వాయిస్ ఆఫ్ అమితాబ్'గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ గాయకుడు సుధేష్ భోసాలే 'అమితాబ్ ఔర్ మై' కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. 'అమితాబ్ ఔర్ మై' కార్యక్రమం మూడు గంటలపాటు జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్లోని ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ ఏర్చికూర్చి సుధేష్ భోసాలే ప్రేక్షకులకు అందించబోతున్నారని చెప్పారు. పాటల రికార్డింగ్, లైవ్ కాన్సర్ట్లలో అమితాబ్ బచ్చన్‌తో సుధేష్ తన అనుభవాలను పంచుకుంటారన్నారు. వర్థమాన గాయకుడు అమోల్ యాదవ్, ముంబై గాయని అర్పిత ఠక్కర్, ప్రవీణ్ సరఫ్ ఆర్కెస్ట్రాలో సుప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను అలరిస్తారని చెప్పారు. ఇండియన్ యూత్ సొసైటీ అధ్యక్షుడు షబ్బీర్ కమర్ మాట్లాడుతూ గతంలో కపిల్ శర్మ, ప్రభు దేవా, ఉదిత్ నారాయణ్, సుగంధ మిశ్రా వంటి ప్రముఖ కళాకారులతో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వాటన్నిటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఈ నెల 23న నిర్వహించే 'అమితాబ్ ఔర్ మై' కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్నారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల్లోని ప్రజాదరణ పొందిన పాటలను ఈ కార్యక్రమంలో పాడతారన్నారు. ఆయన డైలాగ్‌లను కూడా వినిపిస్తారన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









