జీఎంఆర్ ఎయిర్ పోర్టులో ఓ వింత పరిణామం...

- September 18, 2016 , by Maagulf
జీఎంఆర్ ఎయిర్ పోర్టులో ఓ వింత పరిణామం...

జీఎంఆర్ ఎయిర్ పోర్టులో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా ఎయిర్ పోర్టుల్లో వుండే 'డ్యూటీ ఫ్రీ' షాప్‌లో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అక్కడ దొరికే వస్తువులు ఏమైనా కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా విదేశీ మద్యం, సిగరెట్లు, ఎలక్ర్టానిక్స్ వస్తువులతోపాటు కొన్ని ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. వాటి మీద ఎక్సైజ్ సుంకం లేకుండా ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయొచ్చు.
మామూలుగా అక్కడినుంచి తీసుకొచ్చే మద్యం బాటిళ్లు ఇతర వస్తువులపైనా (పరిమితికి మించితే) ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తారు. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్! మొన్నీమధ్యే ఆటా పేరుతో అమెరికాకు వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ సమక్షంలో ఎటువంటి సుంకం చెల్లించకుండానే తమకు కావాల్సిన మద్యం బాటిళ్లను హైదరాబాద్ జీఎంఆర్ ఎయిర్ పోర్టులోనే కొనుగోలు చేసుకునేలా చకచకా ప్లాన్ రెడీ అయిపోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com