రహదారుల దుస్థితిపై కేటీఆర్ దృష్టి

- September 20, 2016 , by Maagulf
రహదారుల దుస్థితిపై కేటీఆర్ దృష్టి

వర్షాలకు హైదరాబాద్ నగరంలో రహదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటి దుస్థితిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషననర్ జనార్ధన్ రెడ్డితో పాటు మెట్రో రైలు, జలమండలి, టీఎస్ఐఐసీ, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. తక్షణమే 150 బృందాలను ఏర్పాటు చేసి నగరంలో యుద్ధప్రాతిపదికన రహదార్ల మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. నాణ్యాతా విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు రహదార్లు వేసే సమయంలో నిర్ణీత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాలన్నీ రానున్న నెల రోజల పాటు పూర్తిగా హైదరాబాద్ రహదార్ల మరమ్మతు, నిర్వహణపైనే దృష్టి సారించాలని కేటీఆర్ ఆదేశించారు.తక్షణ మరమ్మతుల కోసం స్వల్పకాలిక చర్యలు చేపట్టడంతో పాటు మధ్యంతర, ధీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలని సూచించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com