స్టార్స్ దుస్తులను వేలం వేయనున్న సమంత..
- September 20, 2016
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకోందో.. తన సోషల్ సర్వీస్ తో అంతకంటే మంచి పేరు.. అభిమానులను సంపాదించుకొన్నది. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి అనేక మందికి సహాయ పడుతుంది.. ఈ సంస్థ ద్వారా మహిళలు, చిన్నారులకు సేవ చేస్తోంది. కాగా ఈ సంస్థకు అవసరమైన నిధులను సేకరించేందుకు సమంత దుస్తులను వేలం వేయడానికి ప్లాన్ చేస్తోంది.బాగా పేరు తెచ్చుకొన్న సినిమాల్లో నటీనటులు ఉపయోగించిన దుస్తులు, వస్తు సామగ్రిని వేలం వేసి ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈ ప్రత్యూష ఫౌండేషన్ కోసం ఉపయోగించనున్నట్లు తన ట్విట్టర్ లో పేర్కొంది. పవన్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రానా, త్రివిక్రమ్ మరియు తమిళ స్టార్స్ దుస్తులను వేలం వేయనున్నట్లు పోస్ట్ చేసింది. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ లో పవన్ ధరించిన ఖాకీ యూనిఫాం, ఓ పిక్ ని పోస్ట్ చేసింది. ఇటువంటి దుస్తులను.. లేదా ఆ సినిమాలో నటీనటులు ఉపయోగించిన వస్తువులను వేలంలో పెడుతుంది. మరి తమ అభిమాన నటులు ఉపయోగించిన వాటిని.. అదీ ఓ మంచి పనికోసం సమంత చేస్తున్న ప్రయత్నానికి అభిమానులు పోటీపడతారని ఆశించవచ్చు. -
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







