యురి ఉగ్రదాడి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించిన నవాజ్ షరీఫ్
- September 20, 2016
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ యురి ఉగ్రదాడి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో షరీఫ్.. యురిదాడి గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఈ దుశ్చర్యపై ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు.
సోమవారం మీడియా సమావేశంలో భారత్ కు చెందిన ఓ జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధి యురిదాడి గురించి ప్రశ్నించగా, పాక్ ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆయన్ను సమావేశం నుంచి బయటకు పంపారు. ఇక షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా యురి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు.
ద్వైపాక్షిక చర్చల కోసం పాక్ ప్రధాని అమెరికా వెళ్లారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షరీఫ్ కశ్మీర్ అంశాన్ని చర్చించారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా జోక్యం చేసుకోవాలని షరీఫ్ కోరినట్టు ఐక్యరాజ్య సమితిలో పాక్ దూత మలీహా లోధి చెప్పారు. అమెరికా పర్యటనలో షరీఫ్ న్యూజిలాండ్ ప్రధానితో కూడా భేటీ అయ్యారు.
జమ్ము కశ్మీర్ లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. భద్రత దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. యురిదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







