బహరేన్ లో " ప్రవాస దొంగల ముఠా " అరెస్టు

- September 20, 2016 , by Maagulf
బహరేన్ లో

మనామా : ఉద్యోగ ఉపాధికి కాక వారు ఎడారి దేశాలలో చోరకళని ప్రదర్శించాలని  వచ్చి పోలీసులకు ఎంచక్కా దొరికిపోయారు. దొంగతనాలను చేసే ఆ ప్రవాస దొంగల ముఠాను మంగళవారం దక్షిణ గవర్నట్ లో పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ దొంగల బృందం పలు ఇళ్ళల్లో అనేక దొంగతనాలు చేయడంలో ఆరితేరారని వివరించారు. ఆసియా దేశాలకు చెందిన వీరు ఒక  ముఠా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని...వారిని అరెస్టు చేసినట్లు ఆయన ధ్రువీకరించారు. వీరు ఖరీదైన వాచీలు, బంగారు ఆభరణాలను,సెల్ ఫోన్లను తదితర వస్తువులను నేర్పుగా అపహరిస్తారని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com