కొడైకెనాల్‌లో 'బెలూన్‌' మూడో షెడ్యూల్‌..

- September 20, 2016 , by Maagulf
కొడైకెనాల్‌లో 'బెలూన్‌' మూడో షెడ్యూల్‌..

'జర్నీ' ఫేమ్‌ జై, అంజలి కాంబినేషన్‌లో ఇప్పుడు 'బెలూన్‌' అనే చిత్రం నిర్మాణం అవుతోంది. 70ఎం.ఎం ఫిలింస్‌ పతాకంపై టి.ఎన్‌ అరుణ్‌ బాలాజీ, కందసామి నందకుమార్‌ నిర్మిస్తున్నారు. 'బెలూన్‌' ఫేమ్‌ ఎస్‌.శినీష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగినీడు ప్రతినాయకుడుగా చేస్తున్నాడు. యువన్‌ శంకర్‌రాజా బాణీలు సమకూర్చారు. దర్శకుడు ఎస్‌.శినీష్‌ మాట్లాడుతూ '' ఈనెల 25 నుండి కొడైకెనాల్‌లో మూడో షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించడంతో 80 శాతం చిత్రం పూర్తవుతుంది. రెండో షెడ్యూల్‌లో 50 లక్షల వ్యయంతో చెన్నైలో నిర్మించిన సెట్‌లో తీసిన సీన్స్‌ చిత్రానికి హైలైట్‌ అవుతాయి'' అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.శరవణన్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com