' మిస్టర్ 420' ఈనెల 30న విడుదల కానుంది
- September 20, 2016
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా నటించిన చిత్రం ' మిస్టర్ 420'. సాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గజ్జల హరికుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గజ్జల హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ''సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాలో హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ను చూడగానే ప్రేమలో పడతాడు. అనుకోని ఘటనతో హీరో జీవితం మలుపు తిరుగుతుంది. అదేంటనేదే సినిమా. హీరోయిన్ ప్రియాంక ముంబై నుండి తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్‌తో మా బ్యానర్‌లో రెండో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని తెలిపారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ '' సినిమాలో అవినాష్ అనే యువకుడి పాత్రలో కనపడతాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగా రావడానికి రీషూట్ కూడా చేశాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒక చిత్రంలో రైతు పాత్ర చేస్తున్నాను. రామూర్తి దర్శకుడు. ఇక రెండో సినిమా రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన సత్యనారాయణ దర్శకత్వంలో చేస్తున్నాను'' అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కొరియో గ్రాఫర్ : రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్, స్టంట్స్ : నందు, పాటలు : చంద్రబోస్, అనంత శ్రీరామ్ ఎడిటింగ్ : నందమూరి హరి, సినిమాటోగ్రాఫర్ : జశ్వంత్ , మ్యాజిక్ : రియాన్ ముస్తఫా, డైలాగ్స్ : మోహన్ చంద్ర.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







