మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసిన బంగ్లాదేశ్ వ్యక్తికి జీవిత ఖైదు
- September 21, 2016
మనామా : ఒక బంగ్లాదేశీ వ్యక్తి మోటార్ బైక్ విడి భాగాలలో మారిజోనా మాదక ద్రవ్య మాత్రలు దాచి రాజ్యంలోనికి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణ కేసులో యావజ్జీవ శిక్షతో పాటు 5,000 బి డి జరిమానా దేశ బహిష్కరణ విధించబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోటారుబైకుల విడి భాగాలలో మాదక ద్రవ్యాల ప్యాకేజీలను ఉంచి దేశం వెలుపలకు వచ్చి విక్రయిస్తుంటాడని తెలుసుకొన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 30,000 బి డి విలువ కలిగిన మూడు కిలోగ్రాముల బరువు గల గంజాయి 505 మాత్రల ప్యాకేజీని నిందితుని నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ముద్దాయి దేశంలో మాదక ద్రవ్యాలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. ఈ నేరానికి ముద్దాయికి 25 సంవత్సరాల జైలుశిక్షతో పాటు శిక్ష పూర్తి చేసిన తర్వాత బహరేన్ నుండి దేశమునుండి పంపించేస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







