మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు పదేళ్ల జైలు
- September 21, 2016
మనామా: మానవ రవాణా కేసులో ఇద్దరు నిర్వాసిత మహిళలకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల ఖైదును విధించారు.అంతేకాక ప్రతివాదులకు 2000 బి డి జరిమానా సైతం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. వారు జైలు శిక్ష పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించేస్తారు.
రాజ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి మహిళలను నమ్మించి తర్వాత వ్యభిచారంలోనికి బలవంతంగా దింపి మహిళలను శారీరక దోపిడీకి గురిచేశారని వారిపై అభియోగం మోపబడింది. కోర్టు పత్రాలు తెలిపిన ప్రకారం ఆ బాధిత మహిళలను వివిధ అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న గదులలో నిర్బంధించి నిత్యం అపరిచితులతో సెక్స్ కార్యకలాపాలు చేయించారు. అంతేకాక వారిని బలవంతంగా వివిధ భవనాలలో దాచి, ఆ మహిళా ముద్దాయిలు తాము తీసుకువచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేయించి ఆ వచ్చిన డబ్బు ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు. కాగా వీరి చేతిలో బందీలుగా ఉన్న స్రీలు కనీసం తమ తమ ప్రాథమిక నిత్యావసరాలు సైతం లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు.న్యాయవాదులు విచారణ సాక్షులు మరియు పరిశోధనాత్మక నివేదికలు, పలువురు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా వారికి వ్యతిరేకంగా ఆరోపణలు సేకరించిన తరువాత తమ తీర్పుని వెలువరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







