షూటింగ్ పూర్తి చేసుకున్న 'త్రిపుర'
- August 09, 2015
స్వాతి టైటిల్ రోల్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం 'త్రిపుర'. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. జె. రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ బాగున్నాయి. అలాగే, ఓ ప్రముఖ టీవీ చానల్ భారీ ఆఫర్ ఇచ్చి, ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో పెద్ద చిత్రాల శాటిలైట్స్ అంత సజావుగా పూర్తి కావడంలేదు. సినిమా విడుదలైన తర్వాత, ఆ చిత్రవిజయాన్ని బట్టి శాటిలైట్ హక్కులు తీసుకుంటున్నారు. అలాంటిది ఈ చిత్రం స్టోరీ లైన్, సినిమాకి వచ్చిన క్రేజ్ ని చూసి, శాటిలైట్ హక్కులను ఆ చానల్ దక్కించుకుంది. ఈ చిత్రవిశేషాలను చినబాబు తెలియజేస్తూ - "ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. మేం అనుకున్న విధంగా సినిమా బాగా వచ్చింది. స్వాతి నటన హైలైట్ గా నిలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని నిర్మించాలని ఉంది.ఇది యునివర్శల్ కథాంశంతో రూపొందిన చిత్రం కాబట్టి, ఏ భాషకైనా నప్పుతుంది" అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - "నా తొలి చిత్రం 'గీతాంజలి'కన్నా ఈ చిత్రం బాగా వచ్చింది. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. స్వామి రారా, కార్తికేయ విజయాల తర్వాత స్వాతి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో ఆమె హ్యాట్రిక్ సాధించడం ఖాయం. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తి అందించిన సాహిత్యం ఓ హైలైట్. పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గ ఎంటర్ టైనర్ ఇది" అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సంగీతం: కమ్రాన్, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







