ధనుష్ సినిమా ఆస్కార్‌కు నామినేట్
- September 22, 2016
దక్షిణాదికి చెందిన ఓ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయింది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడైన ధనుష్ నిర్మించిన 'విసారణై'(ఇంటరాగేషన్) తమిళంలో సూపర్ హిట్ అయి, జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఎఫ్ఎఫ్ఐ కమిటీ అధ్యక్షుడు కేతన్ మెహతా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' విభాగంలో 29 చిత్రాలు పోటీపడగా, వాటన్నింటినీ వెనక్కినెట్టి పోటీలో నిలిచింది. ఎం. చంద్రకుమార్ 'లాకప్' నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఈ సినిమాకి ముందు 1957లో మదర్ ఇండియా, 1988 సలామ్ బాంబే, 2001లో లగాన్ నామినేట్ అయ్యాయి.
అయినా భారత్‌కు ఇప్పటి వరకూ ఈ కేటగిరీలో ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ చిత్రంతోనైనా భారత్ ఖాతా తెరుస్తుందేమో చూడాలి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానం జరుగుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









