పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలిసిన మోదీ

- September 22, 2016 , by Maagulf
పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలిసిన మోదీ

బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రియోలో భారత జాతి గౌరవాన్ని చాటి చెప్పిన క్రీడాకారులను ఆయన అభినందిస్తూ వారితో కలిసి తీసుకున్న ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ పోటీల్లో గొప్ప విజయం సాధించిన క్రీడాకారుల్ని అభినందిస్తూ.. వారు ఈ విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నాన్ని మోదీ కొనియాడారు.

 
సెప్టెంబర్‌ 7 నుంచి 18 వరకు జరిగిన రియో పారాలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్లు మరియప్పన్‌ తంగవేలు, దేవేంద్ర ఝఝరియా స్వర్ణ పతకాలు సాధించగా, వరుణ్‌సింగ్‌ భటి కాంస్యం, దీపా మాలిక్‌ రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com