ఒమన్ ట్రాన్స్పోర్ట్: క్యాబ్ ఫర్మ్ ఛార్జీల రెగ్యులేషన్
- September 24, 2016
మస్కట్: 1000కి పైగా ట్యాక్సీలు నిర్వహిస్తున్న మవసలాత్ సంస్థ తమ ట్యాక్సీలలో మీటర్‌ని అలాగే ఛార్జీల్నీ రెగ్యులేట్ చేయనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 150 ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలు, 300 మాల్ ట్యాక్సీలు, 500 ఆన్ కాల్ ట్యాక్సీలు ఉన్నాయి. మవసలాత్ సిఇఓ అహ్మద్ బిన్ అలి అల్ ములుసి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర&్టతో కలిసి ట్యాక్సీ బిజినెస్‌ని రెగ్యులేట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఛార్జీలను రెగ్యులేట్ చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందనీ, ఖచ్చితమైన చెల్లింపుల ద్వారా వినియోగదారులకు సమస్యలు ఉండవని ఆయన తెలిపారు. ఏకీకృత ఛార్జీల విధానంతో, అక్రమాలకు తావుండదని వివరించారాయన. ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రయాణీకులు తాము చేసిన ప్రయాణానికి చెల్లిస్తున్న మొత్తానికి బిల్ అడుగుతున్నారు గనుక, ఛార్జీలను రెగ్యులేట్ చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ట్యాక్సీ వినియోగదారులు కూడా మీటర్డ్ ట్యాక్సీల విధానాన్ని ఆహ్వానిస్తున్నారు
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







