ట్రాఫిక్ నుంచి విముక్తి కోసం న్యూ ప్లాన్స్
- September 24, 2016
రోడ్స్ నఅండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ - పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ, ఏడు పబ్లిక్ బస్ రూట్స్‌ని అప్‌గ్రేడ్ చేసి, ట్రాఫిక్‌ని మరింత సులభతరం చేయాలని నిర్ణయించింది. ఆర్‌టిఎ - పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ - ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా అలి మాట్లాడుతూ, రూట్ 17 - అల్ సబ్కా బస్ స్టేషన్ నుంచి దుబాయ్ పోలీస్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ, ముహైసినా వరకు ఎక్స్‌టెండ్ చేయబడింది. రూట్ 32సి - సత్వా బస్ స్టేషన్ నుంచి అల్ క్యుసైసిస్ వెళుతుండగా, ఇది అల్ జఫియా మెట్రో స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే రూట్ 367 - ఎటిసలాట్ మెట్రో స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ సిటీ వరకు వెళుతుంది. పలు రూట్లలో మార్పులు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అధికారులు అంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని విస్తరించడం వల్ల ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల సంఖ్య తగ్గి, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







