బాగ్దాద్‌లో ఒకేసారి మూడు ఆత్మాహుతి దాడులు, 11 మంది మృతి
- September 24, 2016
ఉత్తర బాగ్దాద్‌లో శనివారం జరిగిన మూడు ఆత్మాహుతి దాడుల్లో 11 మంది సైనికులు మృతిచెందారు. ముగ్గురు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో వున్న వాహనాలతో ఒకేసారి భద్రతా సిబ్బంది ఉండే చెక్ పాయింట్ లోపలికి దూసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా మరో 34 మంది సైనికులు గాయపడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీస్ ఉన్నతాధికారి, ప్రొవిన్షియల్ సెక్యూరిటీ కమిటీ అధిపతి చెక్‌పాయింట్‌ను సందర్శిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన చేయలేదని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









