ప్రధాని మోడీ భద్రత బాధ్యత రాధాకృష్ణకు అప్పగింత
- September 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ ఐపీఎస్ అధికారి రాధాకృష్ణ కినీకి అప్పగించారు. కేబినెట్ సెక్రటేరియట్లో సెక్యూరిటీ కార్యదర్శిగా రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో పనిచేసిన మలయ్ కుమార్ సిన్హా సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1981 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన రాధాకృష్ణ.. ప్రస్తుతం నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరోలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా భద్రతా కార్యదర్శి పనిచేస్తారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు భారత్, విదేశాల్లో భద్రతా ఏర్పాట్లను వీరు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









