చికెన్ కార్న్ కబాబ్
- August 10, 2015
చికెన్ కార్న్ కబాబ్
కావలిసిన పదార్ధాలు
చికెన్ ఖీమా - పావుకిలో
మొక్కజొన్న గింజలు - 100గ్రా
కొత్తిమీర - ఒక కట్ట
గరం మసాలా - ఒక స్పూను
క్రీమ్ - 2 స్పూన్లు
ఉప్పు - తగినంత
గుడ్డు తెల్లసొన - ఒకటి
నిమ్మరసం - ఒక స్పూను
పచ్చిమిర్చి పేస్ట్ - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
తయారీ విధానం
చికెన్‌ను శుభ్రంగా కడిగి, దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం గరంమసాలా కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. తరువాత క్రీమ్, గుడ్డు తెల్ల సొన వేసి కలపాలి. ఇప్పుడు ఒక చెక్క పుల్లగానీ, స్కూయర్ గానీ తీసుకుని దానికి ఈ చికెన్ ముద్దను అతికించాలి. దానికి మొక్కజొన్న గింజలను కూడా అతికించి ఓవెన్లో గ్రిల్ చేయాలి. అంతే వేడి వేడి చికెన్ కార్న్ కబాబ్ రెడీ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









