సుష్మాస్వరాజ్‌ న్యూయార్క్‌ చేరుకున్నారు..

- September 25, 2016 , by Maagulf
సుష్మాస్వరాజ్‌ న్యూయార్క్‌ చేరుకున్నారు..

కేంద్ర విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇవాళ ఉదయం న్యూయార్క్‌ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 71 సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆమె ఇక్కడికి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం ఆమె ప్రసంగించనున్నారు. భారత అంతర్గత అంశమైన కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆమె ఈ సమావేశాల్లో గట్టి సమాధానం ఇవ్వనున్నారని భావిస్తున్నారు. ఉగ్రవాదంతోపాటు, భద్రతా సమితి విస్తరణ, వాతావరణ మార్పులు, ప్రపంచ శాంతి వంటి అంశాలపై కూడా సుష్మాస్వరాజ్‌ దృష్టి పెట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్‌స్వరూప్‌ తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో సుష్మాస్వరాజ్‌ ఏం మాట్లాడుతుందోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు.సుష్మాస్వరాజ్‌ ప్రసంగపాఠం వివరాలను ఆయన బయటపెట్టలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com