ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది...
- September 25, 2016
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఒడిశాకు చెందిన బీఎస్ఎఫ్ జవాను పితబస్ మాఝీ(30) శనివారం రాత్రి కన్నుమూశాడు. దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది. గత ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో మాఝీ ఒకరు. నౌపడ జిల్లాలోని దనజోల గ్రామానికి చెందిన మాఝీ 2008లో బీఎస్ఎఫ్లో చేరాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి వద్దామని అనుకున్న జవాను విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాఝీ ఈనెల 22న భార్యతో మాట్లాడాడు. త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తానని ప్రమాణం చేసిన భర్త ఇకలేడనే వార్తను తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. అంత్యక్రియల నిమిత్తం మాఝీ పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







